
Bahujan Bathukamma Celebrations in Peddaapur
పెద్దాపూర్ గ్రామంలో బహుజన బతుకమ్మ వేడుకలు
హాజరైన విమలక్క
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా పెద్దాపూర్ గ్రామంలో బహుజన బతుకమ్మ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అరుణోదయ విమలక్క ముఖ్య అతిథి గా హాజరైనారు. పెద్దాపూర్ గ్రామానికి చెందిన సిపిఐ (యం యల్ )జనశక్తి రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ చంద్రం చిత్రపటానికి పూలమాల వేసి విప్లవ జోహార్లు అర్పించారు.
అనంతరం గ్రామం లోని వాడలగుండ బతుకమ్మలతో ర్యాలీ గా జడ్పీహెచ్ఎస్ గ్రౌండ్ లో ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ ఆడినారు
ఈ కార్యక్రమలో రైతుకూలీ సంఘం ఆర్ సి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్తురు సదానందం, అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు మల్సుర్, ప్రధాన కార్యదర్శి పోతుల రమేష్, ప్రగతిశీల మహిళా సంఘం (స్త్రీవిముక్తి )రాష్ట్ర కన్వీనర్ పగిడేరు అరుణక్క, వాసం రుద్ర, ఏఐఎఫ్ టియు నాయకులు చంద్రగిరి శంకర్, రైతుకూలీ సంఘం జిల్లా నాయకులు మండల యుగేందర్, నరేందర్, కృష్ణ, గోపు రాజన్న, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు రాదండి దేవేందర్,
మానవహక్కులవేదిక కన్వీనర్ కర్ణాటకపు సమ్మన్న,
గ్రామ కాంగ్రెస్ నాయకులు మామిళ్ళ రాజు, గౌడ సంఘం నాయకులు పెరుమాళ్ళ నవీన్, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు గుండ్ల రాజు,కిసాన్ సెల్ నాయకులు గట్టు మహేందర్. అరుణోదయ కళాకారులు బుల్లెట్ వెంకన్న, రాకేష్, పల్లె లింగన్న,గంగా, అరుంధతి, గౌతమ్,కుర్తె లింగం, లలితక్క, తదితరులు పాల్గొన్నారు.