https://epaper.netidhatri.com/
ములుగులో జరుగుతున్న ప్రచార సరళిపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన అంశాలు..ఆయన మాటల్లోనే…
` ముఖ్యమంత్రి కేసిఆర్ పై ములుగులో అచెంచల విశ్వాసం.
` దశాబ్దాల పోడు సమస్య పరిష్కారం.
`పట్టాలందజేతతో ఆదివాసీలలో ఆనందం.
`ఇంత కాలానికి భూ యజమానులమైనామన్న సంతోషం.
`తెలంగాణ వచ్చిన తర్వాతే ములుగు అభివృద్ధి.
`ములుగు జిల్లా ఏర్పాటు తో గొప్ప ప్రగతి.
`వైద్య కళాశాల ఏర్పాటుతో అందుబాటులోకి మెరుగైన వైద్య సేవలు.
`ఒకప్పుడు ములుగు మారు మూల ప్రాంతం.
`ఇప్పుడు అభివృద్ధి చెందిన నగరం.
`బడే నాగజ్యోతి గెలుపు ఖాయం.
` ఆది వాసీ బిడ్డకుకు పెరుగుతున్న ఆదరణ
`అడవిబిడ్డకే ములుగు గడ్డ ఆశీస్సులు.
` ప్రజలంతా ముక్త కంఠంతో చెబుతున్నది ఒకటే మాట…
`నాగజ్యోతిదే గెలుపు బాట.
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణలో మళ్లీ బిఆర్‌ఎస్సే అదికారంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి కేసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు. హాట్రిక్ రికార్డు నమోదు చేస్తాం. ప్రతిపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా, కుట్రలు చేసినా ప్రజలే వాటిని తిప్పికొడతారు. ప్రతిపక్షాల కలలు కల్లలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 11 సార్లు అధికారం అప్పగిస్తే రైతులకు 11 రూపాయలు సాయం అందించలేదు. తెలంగాణ రైతు ప్రభుత్వం ఇప్పటికే 11 సార్లు రైతు బంధు అందించి, రైతులను అదుకున్నది. ఇదీ మా ఘనత. అలాంటి తెలంగాణలో కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించడం అన్నది ఎప్పటికీ జరగదు. ముఖ్యంగా ములుగులో ఈసారి బడే నాగజ్యోతి విజయం ఖాయం. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడో ఆయన గెలుపు ఖరారైంది. ఇక మెజార్టీ ఎంత అన్నదానిపైనే ప్రచారం సాగుతోంది. అంతగా ప్రజల్లో బిఆర్‌ఎస్ వుంది. ముఖమంత్రి కేసిఆర్ మీద ములుగు ప్రజలకు అపారమైన గౌరవం వుంది. ముఖ్యమంత్రి కేసిఆర్ వల్లనే ములుగు ఇంతగా అభివృద్ధి చెందిందన్న విశ్వాసం వారిలో వుంది. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్ల క్రితం ములుగు, ఇప్పుడు ములుగును చూసేవారికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి మన కళ్లముందే కనిపిస్తోంది. నిజానికి ములుగులో గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలవలేదు. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్ ఎక్కడా ములుగు మీద వివక్ష చూపకుండా, అన్ని రంగాలలో ములుగు అభివృద్ధి కావాలని కోరుకున్నారు. అందుకే ములుగు ప్రజలు కోరింది కాదనలేదు. ఏదీ అసాధ్యమని చెప్పలేదు. ఒకనాడు ములుగు అంటే ఓ మారు మూల ప్రాంతం. ఇప్పుడు గొప్పగా మారిపోయిన నగరం. చుట్టూ అభివృద్దికి ఆలవాలం. ములుగు దారులు ఒకప్పుడు ఎలా వుండేవి? ఇప్పుడు ఎలా వున్నాయి? అన్నది అందరికీ తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో ములుగు వెనబడిన ప్రాంతం. వెనక్కి నెట్టివేయబడిన ప్రాంతం. ఆది వాసీల జీవితాలను పట్టించుకున్న పాపాన పోలేదు. కాంగ్రెస్ పార్టీ ఆదివాసీల జీవితాల గురించి ఏనాడు ఆలోచించలేదు. వారిని కనీసం మన సమాజంలో బాగస్వాములు అన్న సంగతి కూడా పట్టించుకోలేదు. ఎంతసేపు ఓటు రాజీకీయాలు తప్ప, ఆది వాసీల జీవితాలకు ఏ విధంగా ఉపయోపగడలేదు. కాని ఇప్పుడు తండాలు, గూడాలకు కూడా రహదారుల సౌకర్యాలు, విద్య , వైద్య సదుపాయలు అన్నీ వచ్చాయంటే కారణం ముఖ్యమంత్రి కేసిఆర్. అలాంటి ములుగులో బిఆర్‌ఎస్ అభ్యర్ధి బడే నాగజ్యోతి కోసం ప్రజలే స్వచ్ఛందంగా ప్రచారం సాగిస్తున్నరంటున్న ములుగు బిఆర్‌ఎస్ ఎన్నికల ఇన్‌చార్చి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుతో చెప్పిన ఎన్నికల ప్రచార విశేషాలు..ఆయన మాటలోలనే…
బడే నాగజ్యోతి ఆది వాసీ ఆడబిడ్డ. అంతే కాదు ఆమె అడవి బిడ్డ.
ములుగు ప్రాంతం అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతంలో అడవిలోనే పుట్టిన నాగజ్యోతి ప్రజలే పెంచుకున్న ఆడపడుచు. ఆమె ప్రతి ఇంటికి ఆడబిడ్డే. ప్రతి ఇంటిలోనూ ఆమె సభ్యురాలే. ప్రతి ఇంటికి ఆమె బందువే. అంతటి అనుబంధం ఆమెకు ములుగుతో వుంది. ప్రజల చేతుల్లో పెరిగి, ప్రజల ఆదరణతో ఎదిగిన నాగజ్యోతి ఆ ప్రజల కోసం పనిచేస్తోంది. ఆ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తోంది. తన ములుగు మొత్తం ప్రగతిని చూడాలని కోరుకుంటోంది. ఆదివాసీల జీవితాల్లో పూర్తి స్ధాయి వెలుగులు నిండాలని అనుకుంటోంది. అంతటి స్వచ్ఛమైన మనసున్న బడే నాగజ్యోతి ములుగులో గెలవాల్సిన అవసరం వుంది. ఆమె గెలిస్తే అడవి బిడ్డలకు ఏం కావలో తెలుస్తుంది. వారి సమస్యలు ఇంకా తీరుతాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంతో ప్రాధాన్యతనిస్తూ ములుగును అభివృద్దికి కృషి చేశారు. అంతే కాదు ఆది వాసీలు కొన్ని దశాబ్దాలుగా కోరుకుంటున్న పోడు భూములకు పట్టాలు అందించిన ఏకైక నాయకుడు కేసిఆర్. గతంలో ప్రజలను ఎన్నికల కోసం ఎగదోసి, తర్వాత వారిని ఇబ్బందులుపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి వుంది. ఆదివాసీ ప్రజలు కోరుకున్న విధంగా పోడు పట్టాలు అందించి, ఆ భూములకు వారిని యజమానులు చేసిన ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వానిది. ఆ ప్రజల్లో ఎంతో సంతోషం నిండిరది. వారిలో ఎంతో ఆనందం వెల్లివిరిసింది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మాట ఇవ్వడం, మర్చిపోవడం గతంలో చూశాం. కాని ఆదివాసీలకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కేసిఆర్ వారిని భూ యజమానులను చేశారు. కొన్ని దశాబ్దాల పాటు అపరిష్కృతంగా వున్న సమస్యను తీర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. తెలంగాణ రావడం వల్ల, ముఖ్యమంత్రి కేసిఆర్ వుండడం వల్లనే ఇలాంటి సమస్య తీరింది.
ఒకప్పుడు ములుగులో విద్య కరువు, వైద్యం కరువు. రవాణా సౌకర్యాలు కరువు. ఆఖరుకు మంచినీటి కరువు. ఇప్పుడు ఆది వాసీ గూడాలకు కూడా మిషన్ భగీరధ నీరు అందుతోంది.
వారి కూడా సురక్షితమైన మంచినీటిని అందించడం జరుగుతోంది. గతంలో ఆదివాసీ గూడాలలో మంచినీటి సమస్య ఎలా వుండేదో తెలియంది కాదు. ప్రజలు మైళ్ల దూరం వెళ్లి మంచినీటి కోసం కష్టపడేవారు. కాని నేడు కొండ కోనల్లో వున్న ఆదివాసీ గ్రామాలకు కూడా మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగింది. తండాలన్నింటినీ పంచాయితీలుగా మార్చడం జరిగింది. వారి పాలన వాళ్లే చేసుకునేందుకు అవకాశం కల్పించబడిరది. అనే గూడాలకు, తండాలకు రోడ్డు సౌకర్యం కల్పించబడిరది. సమాజంతో వారికి సత్సంబంధాలు ఏర్పడేందుకు కృషి చేయబడిరది. ఇప్పుడు ములుగు ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలన్నదే రాష్ట్ర్ర ప్రభుత్వధ్యేయం.
ఉమ్మడి రాష్ట్రంలో వుంటే ములుగు జిల్లా జరిగేదా?
ఇంత ప్రగతి కనిపించేదా? ములుగులో వైద్య కళాశాల వచ్చేదా? మారు మూల ప్రాంతానికి ఇంతగా వైద్యం అందుబాటులోకి వచ్చేదా? విజ్ఞులైన ప్రజలు బాగా ఆలోచించాలి. కాంగ్రెస్ అంటే స్కాములు, అల్లర్లు, కొట్లాటలు, పదవుల కోసం ఆరాటాలు, ముఖ్యమంత్రుల మార్పులు, డిల్లీ పెత్తనాలు వాటితోనే ఐదేళ్లు గడిపోతాయి. అభివృది ్ధ కుంటుపడిపోతుంది. సంక్షేమం గాలికొదిలేయబడుతుంది. ప్రజా సమస్యలు వినేవారుండరు. పదేళ్లు తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిత్యం వినిపిసిస్తేనే పట్టించుకోలేదు. తెలంగాణ మొత్తం ఉద్యమాలు,పోరాటాలు చేస్తేనే లెక్క చేయలేదు. ఇక ప్రజా సమస్యలు కాంగ్రెస్ పట్టించుకుంటుందా? అందుకే తెలంగాణ ప్రజల జీవితాలలో వెలుగులు నింపే పార్టీ బిఆర్‌ఎస్. తెలంగాణను బంగారు తెలంగాణ చేసింది కేసిఆర్. ఆయన నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. ములుగులో బడే నాగజ్యోతి గెవడం పక్కా…