సేవే మార్గం.. సేవే లక్ష్యంగా..
-టిడిపి ప్రస్థానం నుంచి బద్దంపల్లి సర్పంచ్ వరకు రాంరెడ్డి రాజకీయ ప్రస్థానం
మొగుళ్ళపల్లి నేటి దాత్రి
ఆయన పేరు వింటేనే నమ్ముకున్న వ్యక్తులకు, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండే మనస్తత్వమని, 1982లో స్వర్గీయ ఎన్టీఆర్ ప్రభంజనంలో ప్రారంభమైన టిడిపిలో మాజీ ఎంపీపీ కీ: శే: బత్తిని భూమయ్య గౌడ్ నేతృత్వంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని బద్దంపల్లి గ్రామానికి చెందిన బద్దం రాంరెడ్డి తన అనుచరులతో కలిసి టిడిపిలో చేరారు. అప్పటి నుంచి టిడిపిలోనే కొనసాగుతూ నమ్ముకున్న వ్యక్తులకు ఏ ఆపద వచ్చినా తాను ముందుండి ఆదుకునే మనస్తత్వం ఆయన సొంతం. 1982 నుంచి 2023 వరకు టిడిపి పార్టీ అధికారంలో ఉన్న, లేకపోయినా నమ్ముకున్న సిద్ధాంతమే తన ఊపిరిగా టిడిపి పార్టీకి విశేష సేవలందించాడు. బద్దంపల్లి గ్రామానికి చెందిన కీ: శే: బద్దం రాజక్క-బుచ్చిమల్లు దంపతులకు ఐదవ సంతానంగా జన్మించిన బద్దం రాంరెడ్డి ప్రజలకు సేవ చేసే అదృష్టం కోసం ఎదురు చూశాడు. ఈ క్రమంలో స్వర్గీయ ఎన్టీఆర్ ప్రారంభించిన టిడిపిని వేదికగా చేసుకున్నాడు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సందర్భంగా టిడిపి తెలంగాణలో కనుమరుగై పోయినప్పటికీ పార్టీ కోసమే పని చేశాడు. ప్రజా ప్రతినిధిగా అవకాశం రాకపోయినా నిత్యం ప్రజలలో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పరితపించేవాడు. 1982 నుంచి టిడిపి పార్టీలో క్రియాశీల నాయకునిగా ఎదిగిన ఆయన ఎంతోమంది యువకులకు ఆదర్శనీయం. 1982 నుంచి టిడిపి బలపర్చిన అభ్యర్థుల గెలుపులో ఆయన పాత్ర కీలకం. కాగా టిడిపిలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన గండ్ర సత్యనారాయణ రావు ఆహ్వానం మేరకు 2023లో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదే సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థిగా గండ్ర సత్యనారాయణ రావు భారీ మెజార్టీతో గెలిచేలా వ్యూహాలు పన్నాడు. అనంతరం 2025 నవంబర్ లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ బద్దంపల్లి గ్రామ సర్పంచ్ గా ప్రజలు బద్దం రాంరెడ్డిని ఏకగ్రీవ సర్పంచ్ గా ప్రజలు ఎన్నుకున్నారు. నికార్సైన వ్యక్తిత్వం..మంచి మనస్తత్వం కలిగిన బద్దం రాంరెడ్డి ఈ సందర్భంగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ.నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ బద్దంపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీనిచ్చారు.
