వనపర్తి నేటిధాత్రి:
వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రానికి చెందిన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా నాయకులు బాదం వెంకటేష్ గుప్తా కురుమూర్తి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా నియామకం అయ్యారు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా బాధo మాట్లాడుతూ దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నాపై నమ్మకంతో ఉంచి కురు మూర్తి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా నియమించినందుకు శ్రీ వెంకటేశ్వర స్వామికి సేవలు అందించుటకు అవకాశం కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. వనపర్తి పట్టణ సీనియర్ ఆర్యవైశ్యుడు కిరాణం వ్యాపారి లగిశెట్టి చంద్రశేఖర్ ఆర్యవైశ్య సంఘం మాజీ ఉపాధ్యక్షులు శివ సాయినాథ్ కొండ వెంకటేష్ మాట్లాడుతూ బాదం వెంకటేష్ కురుమూర్తి స్వామి పాలకమండలి సభ్యునిగా నియమించినందుకు దేవరకద్ర ఎమ్మెల్యే జి ఎం ఆర్ కు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు