
Baby Sri Harshini dies
స్కూల్ బస్సు క్రింద పడి పాప శ్రీ హర్షిని మృతి
* అన్నను బస్సు ఎక్కించడానికి వచ్చి చెల్ల మృతి
మహాదేవపూర్ జులై 30 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపెల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు పాప శ్రీహర్షిని బస్ కింద పడి మృతి చెందిన ఘటన మంగళవారం రోజున చోటుచేసుకుంది. సూరారం గ్రామానికి చెందిన ఒక ప్రైవేటు ఎస్ ఎస్ వి స్కూలు బస్సు అంబటిపల్లి గ్రామానికి వచ్చి స్కూల్ విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తుండగా అంబటిపల్లి గ్రామానికి చెందిన సింగనేని మల్లేష్, భాగ్య దంపతుల మూడేళ్ల కూతురు శ్రీ హర్షిని(3) తన అన్నను స్కూల్ బస్సు ఎక్కించడానికి వచ్చి ప్రమాదవశాత్తు బస్సు కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కళ్ళముందే పాప మృతి చెందిందని బస్సు డ్రైవర్ ను కఠినంగా శిక్షించాలని గ్రామ ప్రజలు కోరారు. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.