
Baby Girl Born in Ambulance, Both Safe
అంబులెన్స్‌లోనే ఆడబిడ్డకు జన్మ, తల్లి,శిశువు క్షేమం..
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందిన టి. శిరీష(20)కు ఆకస్మికంగా ప్రసవ వేదనలు మొదలయ్యాయి..
వెంటనే 108 అంబులెన్స్ సమాచారం అందించగా స్పందించిన సిబ్బంది ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే అంబులెన్స్‌లో సురక్షితంగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది..
ఎమర్జెన్సీ మెడికల్ సిబ్బంది మాలావత్ గణేష్, పైలట్ పంథంగి మహేష్ తక్షణమే వైద్య సేవలు అందించి తల్లి, శిశువును క్షేమంగా ఉంచారు..
ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్య సిబ్బంది తెలిపారు. ఈ సంఘటనపై గ్రామస్థులు అంబులెన్స్ సిబ్బందిని అభినందించారు.