ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.
: రాజానెల్లి ప్రెండ్స్ యూత్ అసోషియేషన్ ఆధ్వర్యంలో
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహిర్ మండలం రాజానెల్లి గ్రామంలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.భారతదేశ మాజీ ఉప ప్రధానీ మంత్రి బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ప్రెండ్స్ యూత్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెండ్స్ యూత్ ప్రెసిడెంట్ , డీ .ధనరాజ్ మాట్లాడుతూ. బాబు జగ్జీవన్ రామ్ ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. స్వాతంత్ర్యోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్ రామ్ అని, పేదలు, శ్రామికులు, సామాన్యులు, అణగారిన వర్గాలకు సామాజిక, ఆర్థిక సమానత్వం అందించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. దేశంలో ప్రతిఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పేద దళిత కుటుంబంలో పుట్టి దళితుల హక్కుల సాధనకు అవిరామ కృషి చేసిన సంఘ సంస్కర్త, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అణగారిన ప్రజలకు సమాన హక్కుల కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం మర్చిపోలేనిది అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు , నేటి యువత ఆయన అడుగుజాడలలో నడవాలని సూచించారు.ఇట్టి కార్యక్రమంలోడి ధనరాజ్ యూత్ ప్రెసిడెంట్ ధనరాజ్ . మధుకర్. బాగప్ప.ఏవన్ గోల నర్సింలు. గోల సురేష్.హబ్రహం. మెషె. పి.లక్మ్యాన్. చింటూ . సంగన.ఈశ్వర్.కజమియా.ఉపరి వినయ్. జ్యోత్ . నాగప్ప పటేల్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.