అంబేద్కర్ భవన్ లో బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి వేడుకలు.
నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నస్పూర్ అంబేద్కర్ కాలనీ లోని అంబేద్కర్ భవనం లో బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా మహానీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం జిల్లా సీనియర్ నాయకులు కొప్పర్తి రాజం మాట్లాడుతూ కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల నేత దేశ స్వతంత్రం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా సీనియర్ నాయకులు కోప్పర్తి రాజం, మడుగుల శంకర్,జిలకర రాజం,యువ నాయకులు మడుగుల స్వామి దాస్, మడుగుల మహేష్,కొప్పర్తి చింటూ తదితరులు పాల్గొన్నారు.