సిరిసిల్ల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )
సిరిసిల్ల పట్టణంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ జిల్లా తోట ఆగయ్య మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు ఆశయ జ్యోతిగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ అట్టడుగు వర్గాల నుండి అందనంత ఎత్తుకు ఎదిగినటువంటి మహా ఉద్యమ శాలి మరియు తన ఆశయాలు తన బాటలో నడవాల్సిందిగా జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి చైర్ పర్సన్ అరుణా రాఘవరెడ్డి మాజీ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు జిందం కళా చక్రపాణి,కుంభలా మల్లారెడ్డి, మాట్ల మధు, అగ్గి రాములు, కొయ్యడ రమేష్, చిరంజీవి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.