
ములుగు జిల్లా నేటిధాత్రి
ములుగు జిల్లా కేంద్రంలో గల జిల్లా పోలీస్ కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి జిల్లా డా. శబరిష్ ఐ పి ఎస్ పూలమాల వేసి నివాళులర్పించారు సమానత్వం అంటరాని తనం నిషేధం జమీందారు వ్యవస్థ రద్దు వంటి వాటిపై పోరాడుతూ సామాజిక రాజకీయ ఉద్యమాలను ఏకకాలంలో నడిపి దళితుల అభ్యున్నతికై పనిచేసిన వ్యక్తి స్వాతంత్ర్య సమరయోధుడు, దళితుల ఐకాన్ అయిన జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ డా. శబరిష్ ఐపిఎస్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు సామాజిక వేత్త,గొప్ప న్యాయవాది,సమాజంలోని అణగారిన వర్గాల కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన జగ్జీవన్ రామ్ “స్ఫూర్తికి మూలం” అని ఎస్ పి అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ ఐ అడ్మిన్ సతీష్ జిల్లా హెడక్వార్టర్స్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు