Saras Mela Brings Joy to Women in Guntur
బాబు.. బంగారం.. మహిళల ఆనందం
ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఎం అంటే నాలుగు గోడల మధ్య కూర్చునే పెత్తందారు కాదని.. అన్నగా అండగా ఉండటానికే ఇష్ట పడతానంటూ స్టాల్స్ అన్నీ కలియతిరిగారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ని ..
ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న కళాకృతులు.. చేతితో రూపొందించిన బొమ్మలు, వస్తువులు.. ఆకట్టుకుం టున్న వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత, కళంకారీ వస్ర్తాలు.. మహిళలను, యువతులను కట్టిపడేస్తున్న ఆభరణాలు, గృహ అలంకరణ వస్తువులు.. నోరూరిస్తోన్న ఆహార పదార్థాలు, వంటకాలను సరస్ కేంద్రం గుంటూరువాసులకు అందుబాటులోకి తెచ్చింది. దేశంలో, రాష్ట్రంలో విభిన్న ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటుంది. కశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలు, ముంబై నుంచి మిజోరం వరకు తూర్పు, పశ్చిమ రాష్ట్రాల స్వయం సహాయక బృందాల రాకతో సరస్ ప్రాంగణం మినీ ఇండియాను తలపిస్తోంది. అఖిల భారత స్థాయిలో, న్యూఢిల్లీ వెలుపల ఇంత భారీ ఎత్తున సరస్ ప్రదర్శన నిర్వహించడం ఇదే తొలిసారి కావడం అదీ గుంటూరులో ఏర్పాటు చేయడం విశేషం.అయితే, సరస్ మేళాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించగా.. అక్కడ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఎం అంటే నాలుగు గోడల మధ్య కూర్చునే పెత్తందారు కాదని.. అన్నగా అండగా ఉండటానికే ఇష్ట పడతానంటూ స్టాల్స్ అన్నీ కలియతిరిగారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ని సందర్శించి వారి బాగోగులు, ఆర్థిక పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. వివిధ స్టాళ్లను సందర్శించి మహిళా వ్యాపారుల్ని అభినందించారు. మాడుగుల హల్వా రుచి చూశారు. మహిళా సంఘాల ఉత్పత్తుల నాణ్యత, మార్కెట్ సామర్థ్యాన్ని ప్రశంసించారు. ప్రతి స్టాల్ ఒక విజయగాథను చెబుతోందని వ్యాఖ్యానించారు.
