మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి..
తంగళ్ళపల్లిమండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి జై భీమ్ జై అంబేద్కర్ నినాదాలతో ర్యాలీ నిర్వహించి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ స్థాయి గర్వించదగ్గ గొప్ప మహనీయులని ఆయన రచించిన రాజ్యాంగం ఇప్పటికి ప్రపంచ స్థాయిలో దేశ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన రచించిన రాజ్యాంగం ఇప్పటికి అమలవుతుందని ఆయన రచించిన రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు అన్ని కులాలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్ లోపల అభివృద్ధి కార్యక్రమాలు రాజ్యాంగం ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల మహిళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు