Two Arrested in Paddy Scam
బాబోయ్… కుక్కలు, కోతులు
మనిషి కనిపిస్తే చాలు వెంటాడుతూ దాడులు
ప్రభుత్వ దావాఖానాలో పెరుగుతున్న కేసులు
జంకుతున్న ప్రజలు…. పట్టించుకోని అధికారులు
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయం పేట మండలంలోని పలు గ్రామాల్లో కొంతకాలంగా మండలంలో కుక్కలు ,కోతుల బెడద తీవ్రంగా మారింది ఏ గ్రామంలో చూసినా కుక్కలు కోతుల దాడులు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి మనిషి కనిపిస్తే చాలు వెంటప డుతూ ఉన్నాయి దీంతో బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో కోతుల, కుక్కల బెడద తీవ్రం గా ఉన్న అధికారులు తమ కేమి పట్టనట్లుగా వ్యవహ రిస్తున్నారని విమర్శలు వెలు వెత్తుతున్నాయి. చిన్నారులు మరియు వృద్ధులు కుక్కల కోతుల దాడులకు బలవుతు న్నారు రాత్రి అయితే చాలు చెప్పనక్కర్లేదు వీధులు ప్రధాన రహదారిపై గుంపులు గుంపు లుగా సంచరిస్తూ మనిషి కని పిస్తేచాలు వెంటపడుతున్నా యి ద్విచక్ర వాహనాలను వదలడంలేదు మండలము మరియు పలు గ్రామాల్లోని ప్రజలు 300నుంచి 350 మంది దాకా ఆస్పత్రులు పాలయ్యా రు దీంతో రాత్రి వేళల్లో బయ టకు వెళ్లాలంటే ప్రజలు భయ పడుతున్నారు ఇప్పటికైన అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
