రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బహుజనుల బాహుబలి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, గోల్కొండను అధిష్టించిన ధీరుడన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌడన్నలకు గుర్తింపు, తాటి ఈతచెట్ల శిస్తును రద్దు చేసి, ఉపాధి కొరకు నీరా పాలసీ, సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను అధికారికంగా జరిపింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని, గౌడన్నలకు ఐదు లక్షల మరణ బీమా, మూడు లక్షలతో ప్రమాదబీమాను బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్నది, యాభై సంవత్సరాలు నిండిన గౌడన్నలకు అసరా పెన్షన్లు ఇస్తున్నాం, హరితహారం కార్యక్రమం ద్వారా తాటి ఈత వనాలను పెంచడం జరుగుతుంది, ప్రభుత్వం ద్వారా ఈత చెట్లను,గిరక తాటి చెట్లు ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మైత్రి అధినేత కొత్త జైపాల్ రెడ్డి, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ సత్య ప్రసన్న, ఎంపీపీ కలిగేటి కవిత లక్ష్మణ్, ఎంపీటీసీ ఎడవెల్లి నరేందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా బిసి సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, మాజీ సర్పంచ్ నేరెళ్ళ అంజయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి తిరుపతి, వైస్ చైర్మన్ చాడ ప్రభాకర్ రెడ్డి, పొన్నం శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు కొండ వెంకటయ్య గౌడ్, సుద్దాల మల్లేశం, గౌడ సంఘం సభ్యులు, వివిధ కుల సంఘాల సభ్యులు, నాయకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.