మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
రోజుకొక పార్టీ మారుతున్న రాజపూర్ మండలనికి చెందిన పలు గ్రామాల ప్రజలు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన రాజాపూర్ మండలంలోని బోడగుట్టతండాకి చెందిన కొందరు, నాయకులు కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలకు, ప్రలోభాలకు, ఒత్తిళ్ల కారణంగానే కాంగ్రెస్ పార్టీలో చేరమని తెలిపారు. వారు తిరిగి సర్పంచ్ సేవ్యనాయక్ ఆధ్వర్యంలో, బి, ఆర్, ఎస్, పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి, సమక్షంలో వారికి గులాబీ కండువా కప్పి సాధారణంగా పార్టీ లోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో బి, ఆర్, ఎస్, పార్టీని మరో మారు గెలిపించి కాంగ్రెస్ కు బుద్ది చెబుతారన్నారు.
ప్రజలకు బి, ఆర్, ఎస్, తప్ప మరో పార్టీ భవిష్యత్తు ఇవ్వదని పార్టీలో చేరిన నాయకులు తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేసి ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డి ని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించి, మా గ్రామాన్ని మరింత అబివృద్ది చెసుకుంటాం అని తెలిపారు.