Ayyappa Maha Padi Puja Held at Bhupalpally
అయ్యప్ప మహా పడిపూజ మహా అన్న ప్రసాద కార్యక్రమం
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పద్మ దంపతుల
భూపాలపల్లి నేటిధాత్రి
గురువారం మధ్యాహ్నం భూపాలపల్లి మంజూరునగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు – పద్మ దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజ – మహా అన్న ప్రసాద కార్యక్రమం అత్యంత కనులపండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు – పద్మ గారు పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌహార్దాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే అయ్యప్ప స్వాములతో కలసి భిక్ష చేశారు.
