నిజాంపేట: నేటి ధాత్రి
మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో ఎల్లమ్మ తల్లి దేవాలయ ఆవరణలో శుక్రవారం గురుస్వామి నాతి లక్ష్మణ్ గౌడ్ 18వ పడిపూజ మహోత్సవ కార్యక్రమం గురుస్వాములు బాలు, భీమయ్య, రెడ్డిశెట్టి, ఎర్ర గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లక్ష్మణ్ గౌడ్ 18వ పడిపూజ కార్యక్రమాన్ని శబరిమల ధర్మశాస్త్ర ఆశీస్సులతో నిర్వహించడం జరిగిందన్నారు.శబరిమల యాత్ర ఒకసారి చేయడమే ఒక సాహసం అని వారన్నారు. ఈ కార్యక్రమంలో మాల ధరించిన స్వాములు దేశెట్టి సిద్ధ రాములు, తీగల శ్రీనివాస్,రమేష్ గౌడ్ ,అరవింద గౌడ్, వంశి గౌడ్ ,అనిల్ గౌడ్, సామి, నాని ,రాజు ,శీను, నరేష్, ప్రసాద్ ,నరేష్ ,శీను, సంతోష్ గౌడ్ ,వంశీ తదితరులు పాల్గొన్నారు