RTC Depot Felicitates Ayyappa Devotees
నర్సంపేట ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో అయ్యప్పలకు సన్మానం
నర్సంపేట,నేటిధాత్రి:
ఆర్టీసీ బస్సులో శబరిమళ వెళ్లి వచ్చిన అయ్యప్ప స్వాములకు నర్సంపేట డిపో ఉద్యోగులు అపూర్వ స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపో నుండి 7 రోజుల పాటు శబరిమళ యాత్ర ముగించుకుని నర్సంపేట చేరుకున్న అయ్యప్ప మాలదరులు శానబోయిన నరేష్ గురుస్వామి అయ్యప్ప బృందాన్ని నర్సంపేట డిపో ఉద్యోగులు డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ సూచనతో స్వాగతం పలికి పుష్పగుచ్చాలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ అయ్యప్ప స్వాములు ఆర్టీసీ బస్సులో దైవదర్శనాల కోసం చేసుకుని శబరిమళ వెళ్లిరావడం సంతోషకరంగా ఉందన్నారు. శబరిమళ వెళ్లే అయ్యప్ప స్వాములు ఆర్టీసీ బస్సులను బుకింగ్ చేసుకోవాలని కోరారు. అనంతరం డ్రైవర్లు అశోక్ రెడ్డి, మహేందర్, భక్తులు రవీందర్, మాధవ్, యుజిస్టర్ లను సన్మానం చేసారు.ఈ కార్యక్రమం లో డిపో ఉద్యోగులు రాజు, శ్రీధర్,రాంబాబులు పాల్గొన్నారు.
