ఆయుష్మాన్ ఈ కేవైసీకి డబ్బులు వసూలు చేస్తున్న ఆన్లైన్ సెంటర్ల పై చర్య తీసుకోవాలి.

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారే పల్లి మల్లేష్.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బుధవారం రోజున సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లయ్య మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ ఈ కేవైసీ చేయడానికి కొన్ని మీ సేవ కేంద్రాలు మరియు సిఎస్సి సెంటర్లు సామాన్యుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు, కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఈ కేవైసీ చేయాలని చెబుతుంటే కానీ కొంతమంది ఇదే అదునుగా భావించి మీసేవ, ఆన్లైన్, సిఎస్సి సెంటర్ అని పలు పేర్లతో 50 నుండి 100 రూపాయలు ఆపై 150 వరకు వసూలు చేసుకుని ఆర్థిక, సామాజిక దోపిడీకి పాల్పడుతున్నారు. అని అన్నారు, ఆశా వర్కర్లకు, రేషన్ డీలర్ డీలర్లకు కూడా ఉచితంగా చేయమని వర్క్ ఆర్డర్ చెబుతుంది. కానీ కొంతమంది ఆన్లైన్ సెంటర్ మరియు ఇతర సర్వీసుల పేర్లు చెప్పుకొని సామాన్యుడి నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు, ఈ దేశంలో అత్యంత దోపిడీకి గురవుతున్న సామాన్యుడిపై ఇకనైనా ప్రభుత్వ, ప్రజా సంఘాలు నిఘవేయాలని కోరుతున్నాను. సామాన్య ప్రజలకు ఉన్నతికి కారణం కావాల్సిన వాళ్లే దోపిడీకి గురి చేస్తున్నరు. ఇంత జరుగుతున్నా కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారులు. పట్టించుకోవాలని అన్నారు, ఉదాహరణకు ఒక గ్రామంలో మూడు వేల మంది జనాభా ఉంటే ఒక్క కార్డుకు 50 రూపాయలు లెక్క చూస్తే దాదాపు 1,50,000 రూపాయలు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆర్థిక సామాజిక దోపిడీకి పాల్పడుతున్నారు ఈ ఆర్థిక నేరగాలను వెంటనే తగు చట్టరీత్య చర్యలు తీసుకోవాలని వీలయితే అరెస్టు చేయాలని ఈ దుర్మార్గాన్ని అరికట్టాలని జిల్లా మరియు రాష్ట్ర అధికారులకు మరియు ముఖ్యంగా పోలీస్ శాఖ వారిని కోరుతున్నాము. అన్నారు, ఉచితంగా చేసే విధంగా డీలర్లకు ఆశ వర్కర్లకు అవకాశం కల్పించి ప్రజలకు మేలు చేయాలని కోరుతున్నాను. ఈ దుర్మార్గాన్ని ఈ దోపిడీని అరికట్టాలని ప్రజా గొంతుకలు ముందుకు వచ్చి మోసం చేస్తున్న వారికి శిక్షపడేలాగా ముందుకు రావాలని కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఈ నేరగాళ్ల బారి నుండి సామాన్య ప్రజలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరినారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!