చందుర్తి, నేటిదాత్రి:
వేములవాడ కోరుట్ల పట్టణలను కలిపే మార్గం మద్యలో వేములవాడ నుండి 18 కిమీ దూరంలో మా గ్రామం మల్యాల అనగానే సుదూర ప్రాంతాల వారికి మరియు చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలకు గుర్తుకు వచ్చేది చుండేలుక బావి నీళ్ళూ
ఈ విశ్వంలో ప్రతిజీవి మనుగడకు గాలి తరువాత ముఖ్యమైనది నీరు ఈ బావి యొక్క ప్రత్యేకతలు చుండెలుక కరచి చర్మ వ్యాదులు మరియు మంటలు దురద వంటి రోగాలకు మా ఈ చుండెలుక బావి నీళ్ళే ఔషదం మనుష్యులకే కాకుండా సాదు జంతువులకు కూడా ఈ నీళ్లు ఔషదం లాగా పనిచేస్తాయి
ఆదివారం మరియు గురువారం ఏడు వారాలు ఈ బావి నీళ్లతొ స్నానం చేయడం (ఎడమ చేత్తో చేసుకోవడం ఎడమ చేత్తో ఏడు బుక్కల నీళ్లు తాగడం) వంట కూడా ఈ నీళ్లతోనే చెసుకోవడం వల్ల చాలా వరకు చాలా మందికి చర్మవ్యాదులు తగ్గుతాయి ఈ బావి నీళ్లతో స్నానం కోసం
డాక్టర్ల చుట్టు తిరిగిన ఎన్ని మందులు వాడిన తగ్గని చర్మ వ్యాదులు
వరంగల్, హైదరాబాద్, నిజమాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుండి కూడా అనేక మంది వ్యాదిగ్రస్తులు వచ్చి బావి నీటితో వంట చేసుకొని వ్యాది తగ్గేవరకు ఇక్కడే ఉండి వ్యాది తగ్గినవారు ఉన్నారు
పెద్దలు చెప్పిన మాట
ఈ బావి ఎలా వెలసింది
వేల సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి ఒక సన్యాస స్వామీజి వచ్చి గ్రామంలో భిక్షటన చెసుకుంటు గ్రామానుకి కాస్త దూరంగా నివాసం ఉండేవాడు గ్రామంలోని కొందరు చుండెలుక కరచి చర్మం పుండులుగా తయారయ్యి దురదతో ఉబ్బంది పడటం చూసి వారిని తన నివాస స్థలానికి పిలచీ తన చేతులతో ఒక నీటి గుంట తవ్వి అందులో పంచ లోహాలు మరియు రాగి పత్రాన్ని ఆ గుంటలో పెట్టీ గుంటలో నీళ్లతో ఏడు వారాలు స్నానం చెయ్యమని చెప్పగా తన చర్మ రోగం నయం కావడంతో అ కుంటను బావిగా తవ్వి గ్రామస్తులు చర్మవ్యాదులకు నమ్మకంతో స్నాన మాచరిస్తున్నారు, చాలామంది ఇక్కడ స్నానం చేసిన తర్వాత తమ చర్మవ్యాధులు తగ్గాయని తెలియజేశారు.