
బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం స్తంభంపల్లి గ్రామం నుండి బొంగాని అశోక్ గౌడ్ మరియు రాచర్ల రాజేశం అయోధ్య శ్రీరాముని దర్శనం చేసుకున్న సందర్భంగా. అయోధ్య నుండి ప్రసాదం తీసుకువచ్చి గ్రామం లోని శ్రీ సుగ్రీవ స్వామి దేవాలయం వద్ద అందరికీ పంచారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురవాలని పాడి పంటలు మంచిగా పండాలని అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బొంగాని అశోక్, రాచర్ల రాజేశం, గండ్ర నర్సింగరావు, బీమారి లక్ష్మినారాయణ, చిలుముల రమేష్, మొగిలోజి సతీష్ , తంగళ్ళపల్లి భూమేష్ ఎన్నం మహేందర్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.