
బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో సోమవారం అయోధ్య పూజిత అక్షింతలు వైభవంగా నిర్వహించారు. పల్లకిలో అక్షింతల కలశంతో పాటు, రాముని చిత్రపటంతో పల్లకి సేవ చేపట్టారు.
భజన పాటలతో ఇంటింటికి తిరుగుతూ అక్షింతలను భక్తులకు పంపిణీ చేశారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికి అక్షింతలను స్వీకరించారు.ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ అక్కనపల్లి జ్యోతి కరుణాకర్, ఎంపిటిసి అక్కనపల్లి ఉపేందర్, ఎర్రం శ్రీనివాస్ రెడ్డి, బొంగోని అశోక్ గౌడ్, పులి అంజయ్య గౌడు, బీరవల్లి వెంకటేశ్వరరావు, సాయిబాబా సేవకుడు బొడ్డు దేవదాస్, రాచర్ల రాజేశం, చిలుము ల రమేష్, బొంగోని పరశురాం, పులి శేఖర్ గౌడ్, బొంగోని శ్రావణ్ గౌడ్, ల్యాగల మనోజ్, గ్రామంలోని అన్ని కులా సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు పెద్దలు, మరియు మహిళలు, పిల్లలు, పాల్గొన్నారు.