చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చింతలపల్లి హనుమాన్ ఆలయం నుండి మూడు మండలాలకు సంబంధించి 24 మంది రామ భక్తులు అయోధ్యలోని బాల రాములవారిని దర్శించుకోవడానికి బయలుదేరడం జరిగింది. రాములవారి దర్శనానికి ముందు చింతలపల్లి లోని శ్రీ హనుమాన్ టెంపుల్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆనాడు కర సేవలో పాల్గొన్నటువంటి వారికి శాలువాతో సత్కారం జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బుర్ర తిరుపతి (చిట్యాల ఖండ కార్యవాహ) కరసేవకు వెళ్ళిన వారిని ఒక్కొక్కరిగా పరిచయం చేస్తూ వారిలో మొదటగా చింతగింది నగేష్ (1990 లో)మొగలపల్లి వాస్తవ్యులు, చింతకింది దశరథం, కీ”శేషులు గంగాధర మొగలి తనయుడు గణేష్ (1992) లో చిట్యాల వాస్తవ్యులు వెళ్లడం జరిగింది అని చెప్పి వీరిని చిట్యాల గవర్నమెంట్ డాక్టర్ వివేక్ సాత్విక్ శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో చిట్యాల ఖండ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ మహేందర్ జీ మరియు శ్రీ బాల రాముని భక్తులు పాల్గొన్నారు.