ప్రభుత్వ పాఠశాలలో చట్టాలపై అవగాహన సదస్సు…
●సీనియర్ సివిల్ జడ్జి సూరి కృష్ణ,
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం లోని ఝరాసంగం మండలం ప్రభుత్వ పాఠశాలలో చట్టాలపై అవగాహన సదస్సు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో ఝరాసంగం మండల కేంద్రంలో గల జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో, కస్తూర్భా బాలికల విద్యాలయంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సును సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సూరి కృష్ణ నిర్వహించి విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించి, సూచనలు చేశారు. న్యాయమూర్తి న్యాయవాదులు మాట్లాడుతూ ప్రతీ విద్యార్ధి చదువుతోపాటు సాధారణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విద్యార్థులు నిత్యజీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదురుకాకుండా ఉండడానికి, ఒకవేళ సమస్యలువస్తే వాటిని అధిగమించడానికి చట్టాలు తొడ్పాడుతాయని సూచించారు. కార్యక్రమంలో నిజజీవితంలో చట్టాల ఉపయోగం, సైబర్ క్రైమ్, సమాచార హక్కు చట్టం, మోటారు వాహనాల చట్టం, బాలకార్మిక నిర్మూలన చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం, జువైనైల్ జస్టిస్ యాక్ట్, ఉచిత న్యాయసేవా సహాయంపై విద్యార్థులకు తెలియజేసారు. విద్యార్థులందరూ చట్టాలను గౌరవించాలని సూచించారు. ఏ సమాచారం గురించి తెలుసుకోవాలనుకున్న మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయంను సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్ గోపాల్ , వైస్ ప్రెసిడెంట్ మానెన్న సీనియర్ న్యాయవాది పాండురంగా రెడ్డి న్యాయ వాదులు రుద్రయ్య స్వామి సయ్యద్ షకీల్ లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.