
Awareness Session on Gender Determination Act in Mutharam"
లింగ నిర్ధారణ చట్టంపై అవగాహన సదస్సు
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం, ఖమ్మంపల్లి (సందరెల్లి) గ్రామంలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ మరియు నషాముక్త్ భారత్ ఆధ్వర్యంలో లింగ నిర్ధారణ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
మహిళల, బాలల హక్కులు: ఆడపిల్లల సంరక్షణ, లింగ నిర్ధారణ, అంటరానితనం, బాలల హక్కులు మరియు చట్టాలు, మహిళల హక్కులు గురించి వివరించారు.
* బేటీ బచావో బేటీ పఢావో: ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు, ఇది ఆడపిల్లలను రక్షించడం, వారికి విద్యను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
* బాల్య వివాహాల నివారణ: బాల్య వివాహాలను నివారించడానికి తీసుకున్న చర్యలు మరియు చట్టాల గురించి తెలియజేశారు.
* సహాయక సేవలు: అంగన్వాడీ సేవలు, చైల్డ్ హెల్ప్‌లైన్ మరియు సఖి సేవలు, సీనియర్ సిటిజన్లకు సంబంధించిన సహాయక సేవల గురించి కూడా వివరించారు.
* చట్టాలు, నేరాలు: పని ప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన చట్టం, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణ మరియు అత్యవసర సమయాల్లో ఉపయోగపడే హెల్ప్‌లైన్ నెంబర్ల గురించి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో శ్యామల (సోషల్ వర్కర్), శ్రావణ్ (అవుట్‌రీచ్ వర్కర్), నషముక్త్ భారత్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల,సతీష్ (చైల్డ్ హెల్ప్‌లైన్ కౌన్సిలర్), హరీష్ (చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్వైజర్), అంగన్వాడీ టీచర్ తిరుమల,ఆశా వర్కర్ సరిత, ఆసుపత్రి సిబ్బంది, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.