జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని రెండవ నెంబర్ అంగన్వాడి కేంద్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ పక్షం కార్యక్రమం పై అవగాహన సదస్సు జరుపబడింది. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పోషణతో కూడిన ఆహారం తీసుకోవాలని,పాలు, పండ్లు, కూరగాయలు, గుడ్లు, మాంసాకృతులతోపాటు చిరుధాన్యాలు తీసుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. బలవర్ధకమైన ఆహారం వలన ఆరోగ్యకరమైన శిశువులు జన్మించే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని,ఆహారంతో పాటు రోజు వైద్యులు సూచించిన విధమైనటువంటి వ్యాయామాలు, దినచర్యలో మార్పులు తప్పకుండా చేసుకోవాలని, క్రమం తప్పకుండా ఆసుపత్రికి వెళుతూ సక్రమంగా మందులు వాడాలని, వైద్యులు తెలిపిన జాగ్రత్తలను పాటించి సుఖప్రసవాన్ని పొందాలని సూచించారు. అనంతరం ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మాతా శిశు పథకం గురించి అలాగే పోషణ పక్షం పథకం గురించి గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించి తెలపడం జరిగింది. తదుపరి గర్భిణీ స్త్రీలకు శ్రీమంత కార్యక్రమం జరిపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత, ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ జే.ప్రేమల, అంగన్వాడీ టీచర్లు ఆర్.సరిత, ఆర్.ఉమాదేవి,ఎ.అశ్విని. ఆశ కార్యకర్త అన్నపూర్ణ, మరియు దుబ్బపల్లి అంగన్వాడీ టీచర్లు శ్యామల, శారద, కిషోర్ బాలికలు, పాఠశాల పిల్లలు, గర్భవతులు, బాలింతలు ,మహిళలు పాల్గొన్నారు.