వేములవాడ రూరల్ నేటిధాత్రి
జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ వారి ఆధ్వర్యం లో మరియు వ్యసాయ శాఖ, వేములవాడ వారితో కలిసి ఈ రోజు మండలం లోని చెక్కపల్లి గ్రామములో వరిలో సల్ఫైడ్ దుష్ప్రవంపై మరియు మోగి పురుగు సమగ్ర సస్యరక్షణ విధానాల మీద రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ఏరువాక కేంద్రం, శాస్త్రవేత్త మరియు కోఆర్డినేటర్ డా. కె. మదన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రస్తుతం వరి పొలాలలో సల్ఫైడ్ దుష్ప్రవంతో పాటుగా మోగి పురుగు ఎక్కువగా కనిపిస్తుందని రైతులకు తెలియజేశారు. సల్ఫయిడ్ దుష్ప్రభావం ద్వారా వేర్లు నల్లగా మారి కుళ్ళిపోవడం మరియు కుళ్ళిన కోడిగుడ్ల వాసన, పొలంలో బుడగలు రావడం గమనించవచ్చు. నివారణకు కాంప్లెక్స్ ఎరువులను పైపాటిగా వేయకుండా చూడాలి. మురికి నీరుని తీసేసి సన్నటి పగుళ్లు వచ్చేవరకు వరి పొలాన్ని ఆరబెట్టుకొని, తడి పొడి పద్దతిలో నీటి తడులు ఇవ్వాలని చెప్పారు. అలాగే వరిలో రైతులు కాంప్లెక్స్ ఎరువుల వినియోగాన్ని కూడా తగ్గించాలని, రైతులందరూ భూసార పరీక్షలు చేయించుకుని, పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల యజమన్యాన్ని చేపట్టాలని రైతులకు సూచించారు. తదనంతరం జిల్లా ఏరువాక కేంద్రం శాస్ర్తవేత్త డా. ఎం. రాజేద్రప్రసాద్ మాట్లాడుతు ప్రస్తుత వాతావరణ
పరిస్థితుల్లో వరి లో ప్రధాన సమస్య అయిన మొగి పురుగు సమగ్ర యాజమాన్యం మీద అవగాహన కల్పించడం జరిగింది. నారుమడి దశ లో మరియు పిలక దశ లో ఆశిస్తే మోగి ఎండిపోయి చనిపోతాయి. ఆలస్యంగా ముదురు నారు నాటడం, కరువు పరిస్థితులు, తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు వుండి, సూర్యరశ్మి రోజుకు 7 గంటల కంటే ఎక్కువ వుంటే ఈ పురుగు రావడానికి అనుకూలం. ఈ తల్లి రెక్కల పురుగు ముదురు గోధుమ,
ఎoడుగడ్డి, పసుపు రంగులో ఉన్న ఆడ పురుగుల ముందు జత రెక్కల పై నల్లటి మచ్చ కలిగి వుంటాయి.తెలుపు గోధుమ రంగు లో వుండే పిల్ల పురుగులు (లార్వా) ఎదిగిన తరువాత నారింజ పసుపు రంగు తల కలిగి వుంటుంది. నారు పీకే 7 రోజుల ముందు 2 గుంటల నారు మడికి 800 గ్రాముల కార్బోప్యురాన్ 3జి గులికలను చల్లి నీటిని ఆ మడిలో నే ఇంకెట్లు చేయాలి. ముదురు నాటు నాటేటప్పుడు నారు కొనలను త్రుంచి వేయాలి. నాట్లు వేసిన 10 నుండి 15 రోజులలో కార్బోప్యురాన్ 3 జి గుళికలను ఏకరానికి 10 కి లో ల చొప్పున లేదా కార్టప్ హైడ్రో క్లోరైడ్ 4జి గుళికలు ఎకరానికి 8 కిలోలు లేదా క్లోరాoత్రనిలిప్రోల్ 0.4 జి గుళికలు 4 కిలోలు చల్లుకోవాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు చిరు పొట్ట దశలో కార్టప్ హైడ్రో క్లోరైడ్ 50 ఎస్.పి. 400 గ్రా/ ఎకరాకు లేదా క్లోరనింత్రినీలిప్రోలు 60మి. లి ఎకరాకు పిచికారి చేసుకోవాలి. తరువాత శాస్త్రవేత్తలు రైతుల పొలాలలో క్షేత్ర సందర్శన చేసి తగు సూచనలు చేశారు. ఈ క్షేత్ర ప్రదర్శనలో భాగంగా వ్యవసాయఅధికారి సాయి కిరణ్ మరియు వ్యవసాయ విస్తరణ అధికారిని శ్రీమతి. అనూష మరియు రైతు సోదరులు పాల్గొన్నారు.