మిల్స్ కాలనీ పోలీసుల ఆధ్వర్యంలో…
నేటిధాత్రి, వరంగల్
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఏ.జె మిల్స్ కాలనీ పోలీసులు ఈ రోజు ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సీఐ మల్లయ్య మాట్లాడుతూ, ప్రస్తుత రోజులలో స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నటువంటి ప్రజలు ఎవ్వరు కూడా ఓటీపీలు చెప్పరాదని, బ్యాంకు నుంచి వచ్చేటువంటి కాల్స్ కి అప్రమత్తంగా ఉండాలని, ఆధార్ నెంబర్లు నుండి కేవైసీలు అడిగితే జాగ్రత్త పడాలి అని, దయచేసి బెట్టింగులు పెట్టకుండా, అలాగే యువత చెడు మార్గాన పోవడానికి ఉన్న అప్లికేషన్స్ గురించి, ఇలాంటివి ఎవరు కూడా తెలిసి తెలియక మోసపోకుండా ఉండాలంటే స్మార్ట్ ఫోన్ ఆప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అలాగే ఇలాంటివి ఏవి ప్రజల దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం తెలియజేస్తూ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈరోజు ఏజే మిల్స్ కాలనీ సీఐ మల్లయ్య ఆధ్వర్యంలో సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.