నేటి దాత్రి కమలాపూర్ (హనుమకొండ)
మండలంలోని ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లకు కమలాపూర్ సిఐ హరికృష్ణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పేపర్లు, ఇన్సూరెన్స్, డ్రైవర్ కు సంబంధించిన లైసెన్సు తో పాటు వాహనాలు సరైన ఫిట్నెస్ కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలకువిరుద్ధంగా ప్రయాణిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ హరికృష్ణ పోలీస్ సిబ్బంది తో పాటు 50 మంది ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు, పాల్గొన్నారు.