వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి పట్టణంలో రావుస్ జూనియర్ కళాశాల విద్యార్థులకు లోక్ అదాలత్ సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కార్యక్రమం వివరాలను డిఫెన్స్ కౌన్సిల్ జి ఉత్తరయ్య న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షులు డేగల కృష్ణయ్య విద్యార్థులకు వివరించారు సైబర్ నేరాలు గృహహింస ఫోక్సో ర్యాగింగ్ తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు ప్రజలకు ఉచిత న్యాయ సేవలు లోక్ అదాలత్ ద్వారా ఉచితంగా పొందవచ్చు అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రామ్ కుమార్ న్యాయవాది రియాజ్ అహ్మద్ లోక్ అదాలత్ సిబ్బంది స్వప్న నరేష్ గౌడ్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు