Awareness Program for Farmers on HT Cotton Risks
రైతులకు అవగాహన కార్యక్రమం
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలోని రైతు వేదికలో సోమవారం హెర్బీసైడ్ టాలరెంట్ (హెచ్టి) పత్తి సాగు వలన కలిగే దుష్ప్రభావాలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడిందని ఏవో త్రివేదిక ఒక ప్రకటనలో తెలిపారు. ఈకార్యక్రమంలో ఎఆర్ఎస్కే చింతకుంట శాస్త్రవేత్త డా. రజినీకాంత్ పాల్గొని హెర్బీసైడ్ టాలరెంట్ (హెచ్టి) పత్తి సాగు రైతులకు అనేక విధాలుగా నష్టాలను కలిగించే అవకాశముందని తెలిపారు. ఇటువంటి విత్తనాలు అనధికారికమైనవని, రైతులు వాటిని సాగు చేయకూడదని సూచించారు. అలాగే ప్రభుత్వ అనుమతి పొందిన పత్తి విత్తనాలనే ఉపయోగించాలని రైతులకు అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి త్రివేదిక, సర్పంచ్ అంజనీ కుమార్, ఉపసర్పంచ్ రాజిరెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
