జీవన ఎరువుల వాడకం పై అవగాహన.

రామాయంపేట (మెదక్)నేటి ధాత్రి.

ఈరోజు కోనాపూర్ చిన్న తండాలో వ్యవసాయ శాఖ మరియు కృషి విజ్ఞాన కేంద్రం తునికి ఆధ్వర్యంలో రైతులకు జీవన ఎరువుల వాడకంపై అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది అందులో భాగంగా బాస్వరం కరీగించే ఎరువుల వినియోగం, ఎరువుల వల్ల కలిగే లాభాలు, జీవన ఎరువులను వివిధ పంటల దశలలో వాడే విధానం గూర్చి, క్షేత్ర ప్రదర్శన ద్వారా రైతులకు అవగాహన కల్పించడం జరిగింది .ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజ నారాయణ మాట్లాడుతూ రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడడం వల్ల భూమిలో చౌడు పెరిగి సమతుల్యం దెబ్బతినడం ద్వారా పంటలు దిగుబడి గణనీయంగా తగ్గుతుందని నేలలోని రసాయనిక మార్పుల వల్ల పంటకు మేలు చేసేటువంటి సేంద్రియ కర్బన పదార్థం తగ్గడం వల్ల భూమికి మేలు చేసేటువంటి సూక్ష్మజీవులు మరియు వానపాముల సంతతి క్రమ క్రమంగా తగ్గి పంటలు దిగుబడి తగ్గడం ద్వారా రైతుకు ఆదాయం తగ్గుతుంది అదేవిధంగా మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల రైతు యొక్క పెట్టుబడి ఖర్చులు పెరగడంతో పాటుగా నేల మరియు నీరు, గాలి కాలుష్యం వల్ల పంట ఉత్పత్తుల నాణ్యత దెబ్బతీనడం వల్ల వాటిని తినే వినియోగదారులకు కూడా అనేక దీర్ఘకాలిక సమస్యలు ఉన్న నేపథ్యంలో రైతులు రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవన ఎరువులు వాడాలని జీవన ఎరువులను వాడడం వల్ల రైతు యొక్క పెట్టుబడి ఖర్చులు తగ్గే అవకాశం ఉందని నేలలో సేంద్రియ కర్బన పదార్థం కూడా పెరిగే అవకాశం ఉందని సేంద్రీయ పద్ధతి ద్వారా జీవన ఎరువులు వాడి పండించిన పంటలు యొక్క ఉత్పత్తులు విష రహితంగా ఉండి వాటిని సేవించే వినియోగదారుల ఆరోగ్యం కూడా కాపాడుకునే అవకాశం ఉన్నందున రైతులు సేంద్రియ పద్ధతిలోనే జీవన ఎరువులు వాడకం పాటించాలని ఈ జీవన ఎరువులు ఉండేటువంటి సూక్ష్మజీవులు నేలలోని అందుబాటులో లేని రూపంలో ఉన్నటువంటి ఎరువులను అందుబాటులో ఉండే విధంగా మార్చడం వల్ల రసాయన ఎరువుల వినియోగం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలిపారు ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉండే విధంగా కృషి విజ్ఞాన కేంద్రం తునికి నందు జీవన ఎరువుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడమైందని రైతులకు నాణ్యమైన జీవన ఎరువులను తక్కువ ధరలకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నామని జీవన ఎరువుల గూర్చి మరిన్ని వివరాలకు కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించాలని మరియు సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు శ్రీనివాస్ ఉదయ్, శ్రీకాంత్ ,మరియు వ్యవసాయ విస్తీర్ణ అధికారి రాజు మరియు ఇతర రైతులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *