నూతన రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన…

నూతన రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన

పామాయిల్ సాగు చేయండి…! నెల నెల ఆదాయం పొందండి…!

మార్కెట్ డిమాండ్ ఉన్న మంచి లాభదాయకమైన పంట… ఆయిల్ ఫామ్ తోట

మహబూబాబాద్ జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ… గ్రామ గ్రామాన ప్రచార కార్యక్రమం

కేసముద్రం/ నేటి ధాత్రి

నూతన రైతులకు ఆయిల్ పామ్ సాగు పై అవగాహన కల్పిస్తున్నామని
ఆయిల్ పామ్ , ఉద్యాన పంటల సాగు లాభదాయకం
పంట మార్పిడితో అధిక ఆదాయం
ఆయిల్ పామ్ సాగు పై అవగాహన మరియు క్షేత్ర సందర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

రైతులను వరి, పత్తి, మొక్కజొన్న, మిరప వంటి పంటల నుండి పంట మార్పిడి చేయించి లాభాలను ఇచ్చే ఆయిల్ పామ్, పండ్లు, కూరగాయలు, మునగ, పూలు, మల్బరీ, తేనెటీగలు పెంపకం, పుట్టగొడుగుల పెంపకం మొదలైన మార్కెట్ డిమాండ్ గల వాటిని సాగు
చేయాలని శుక్రవారం కేసముద్రం మండలం కల్వల గ్రామం వద్ద ఆయిల్ పామ్ పై అవగాహన మరియు ప్రదర్శన క్షేత్ర సందర్శన ను సేనాల శ్రీపాల్ రెడ్డి ఆయిల్ పామ్ తోటలో నిర్వహించనైనది.
రైతులను ఉద్దేశించి జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న తో పాటు పలువురు మాట్లాడుతూ ప్రభుత్వ రాయితీలు, కూరగాయల పందిళ్ళు, మల్చింగ్, కోల్డ్ రూమ్స్, నిల్వ గిడ్డంగులు, షేడ్ నెట్ హౌస్లు, ఆయిల్ పామ్ రాయితీ, మార్కెటింగ్ వసతులు, మల్బరీ రాయితీలు పొందాలని తెలిపినారు. రైతులు నీటి, భూసార పరీక్షలు చేయించుకోవాలి, ప్రకృతి సేద్యం అవలంభించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేల్పుల సుజాత, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మెన్ గంట సంజీవ రెడ్డి, జిల్లా రవాణ కమిటి డైరెక్టర్ రావుల మురళి మరియు అభ్యుదయ రైతుల అమృత హస్తాలతో పంట మార్పిడి ద్వారా ఆయిల్ పామ్ అలాగే ముల్బరి సాగు పై కర పత్రాలు మరియు డైరీలు ఆవిస్కరించనైనది.అదేవిదంగా ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్న కల్వల క్లస్టర్ రైతులకు భుసారా పరీక్ష పత్రాలు అందచేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేల్పుల సుజాత, జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మెన్ గంట సంజీవ రెడ్డి, జిల్లా రవాణ కమిటి డైరెక్టర్ రావుల మురళి, వ్యవవసాయ సహాయ సంచాలకుడు ఎ. శ్రీనివాస్, ఉద్యాన పరిశోదన స్టానం శాస్త్రవేత్త ప్రశాంత్, ఆయిల్ ఫెడ్ జిల్లా ఇంచార్జీ సి.హెచ్. రాములు, వ్యవసాయ అధికారి బి.వెంకన్న, ఉద్యాన అధికారి ఎ. జే. శాంతి ప్రియదర్శిని, పట్టు పరిశ్రమ అధికారులు, సురేష్, రాజయ్య, వ్యవసాయ విస్తరణ అధికారులు లావణ్య, సాయి చరణ్, ఉద్యాన మరియు ఆయిల్ ఫెడ్ విస్తరణ అధికారులు,రాజ్ కుమార్, రమేష్, విజయపాల్ రెడ్డి, శ్రీకాంత్, అనిల్, నాగరాజు, నర్మద, రామ్ రంజిత్, కరుణాకర్, బిందు సేద్య ఇంజనీర్ కిషోర్, బిందు సేద్య ప్రతినిధులు అశోక్, ప్రసాద్, శరత్, అగస్టిన్, కారంత్ మరియు అభ్యుదయ రైతులు, వీర రెడ్డి, డా. పాల్వాయి రామ్ మోహన్ రెడ్డి, బొబ్బల యాకుబ్ రెడ్డి, పేరేటి వెంకట్రామనర్సయ్య, మూల అశోక్ రెడ్డి, ముల జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బోర్లు-బావుల క్రింద వరి, పత్తి, మిరప, మొక్కజొన్న వంటి పంటలకి బదులుగా, మార్కెట్ డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్, అన్ని రకాల కూరగాయలు, పండ్లు, మునగ, ఉల్లి, వెల్లుల్లి, పూలు, మల్బరీ మొదలైన వాణిజ్యపరమైన పంటలు సాగు చేయాలని హితువు పలికారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version