Cyber Crime Awareness Program Held at Mogullapalli
ప్రాడ్ కా ఫుల్ స్టాప్” కార్యక్రమం ద్వారా సైబర్ నేరాలపై అవగాహన
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్ళపల్లి మండలం లో సైబర్ నేరాల నివారణ కోసం SI బి అశోక్ గారి ఆదేశాల మేరకు 27.11.2025 మొగుళ్ళపల్లి మండలం లోని MJP స్కూల్ లోని టీచర్ లకు , విద్యార్థులకు ఏ ఎస్సే ప్రకాష్ గారు సిబ్బందితో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు
జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంపు లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో “ప్రాడ్ కా ఫుల్ స్టాప్” పేరుతో 42 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాల లో భాగంగా ఏఎస్ఐ ప్రకాష్ గారు మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి ఫ్రాడ్ కాల్స్ పట్ల జాగ్రత్త గా ఉండాలి ఎలాంటి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి తక్కువ సమయంలో ఎక్కువ లాభం లాంటి మోసపూరిత పెట్టుబడి గురించి, డిజిటల్ అరెస్ట్ వంటి బయపెట్టే మరియు మభ్యపెట్టే విధంగా వచ్చే అపరిచిత కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలి అని తెలిపారు అలాగే అలాగే వివిధ రకాల సైబర్ నేరాలు పట్ల అప్రపత్తంగా ఉండాలి అని ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు మరియు ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ కాంపెయిన్ యొక్క ప్లేడ్జ్ ను విద్యార్థులతో మొగుళ్ళపల్లి సైబర్ వారియర్ కృష్ణ చేపించారు .అంతే కాకుండా
నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నందున ఏ అనుమానాస్పద లింకులు లేదా ఫైళ్లను క్లిక్ చేయవద్దని సూచించారు.
సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 కు కాల్ చేయాలని, అలాగే NCRP www.cybercrime.gov.in సంబంధిత పోలీస్ అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటారని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది మమత,కృష్ణ విజయ్ హృదయంజలి కృష్ణ రవి, శంకర్ పాల్గొన్నారు
