SI Rajesh.
రాంపూర్ ఉన్నత పాఠశాలలో సైబర్ , డ్రగ్స్ పైన అవగాహన
నిజాంపేట్, నేటి ధాత్రి
రాంపూర్ ఉన్నత పాఠశాలలో నిజాంపేట ఎస్సై రాజేష్ గారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ మరియు డ్రగ్స్ పైన విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి డ్రగ్స్ పైన అవగాహన కలిగి ఉండాలని కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించాలి అని ఎలాంటి సమస్యలు సందేహాలు ఉన్న 112 నెంబర్ కు డయల్ చేసినచో కావలసిన సహాయం అందుతుంది అని తెలిపారు. ముఖ్యంగా అమ్మాయిలు ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే ముందుగా తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు , స్నేహితులకు చెప్పి పరిష్కరించుకోవాలి అని అలా సమస్య పరిష్కారం కాని సమక్షంలో 112 కు డయల్ చేసి సహాయం పొందొచ్చు అని సూచించారు. పాఠశాల హెచ్ఎం పద్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అందరూ సోషల్ మీడియా, చుట్టు జరుగుతున్న విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి అని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ కోఆప్షన్ మెంబర్ గౌస్, ఏఏపిసి చైర్మన్ ఇందిర, గ్రామ కార్యదర్శి చంద్రహాస్, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పరశురాములు, ఉపాధ్యాయులు ఈశ్వరయ్య, అర్జున్, సుకన్య, నరేష్, కుమారస్వామి, పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ కానిస్టేబుళ్లు విజయ్, రమేష్ గ్రామస్తులు సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.
