Police Awareness Program for Students in Nekkonda
పోలీస్ వ్యవస్థ పై విద్యార్థులకు అవగాహన
#నెక్కొండ ,నేటి ధాత్రి:
పోలీస్ అమరవీరుల వార్షికోత్సవాల సందర్భంగా నెక్కొండ ఎస్సై మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు పోలీస్ వ్యవస్థ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నెక్కొండ మండల కేంద్రంలోని విద్యోదయ హై స్కూల్ విద్యార్థుల పాల్గొన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీస్ వ్యవస్థ పని చేసే పనితీరును ఎస్సై మహేందర్ రెడ్డి తో పాటు కానిస్టేబుళ్లు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ పోలీస్ సిబ్బంది, విద్యోదయ హై స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
