ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం లో నీ అడవి శ్రీరాంపూర్ గ్రామం లో ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ రావు హోమియో వైద్యదికారి డా. శ్రీవాణీ తో కలసి సీజనల్ వ్యాధులు ప్రబులుతున్న దృశ్య మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించినారు. ఈ సందర్బంగా వైద్యాధికారి అమరేందర్ రావు మాట్లాడుతూ క్యాంపు లో భాగంగా ఒపి గా 105 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో కొందరికి బాడీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ జలుబు దగ్గు ఉండగా కొంత మంది కి జ్వరాలు ఉన్నవారికి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి టీ హబ్ పెద్దపల్లి పంపుతూ మందులు పంపిణీ చేయడం తో పాటు అవసరం అయిన వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు పంపించి గ్లూకోజ్ పెట్టించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ దొడ్డ గీతా రాణి బాలాజీ ఎం ఎల్ ఎచ్ పి దీప్తి. లావణ్య పి ఎచ్ ఎన్ లలిత లాబ్ టెక్నీషియన్ అనిల్ సూపర్ వైజర్స్ వీరేస్ పశుల. శ్రీనివాస్ ఏ ఎన్ ఎమ్ రమ ఆశలు ఉయ్యాల రజిత. శేశి. జ్యోతి. సుజాత. పాల్గొన్నారు.