నడి కూడ,నేటి ధాత్రి:
దేశంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక రోజు రైల్వే గేట్ల వద్ద ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని, మనం నిత్యం పేపర్లో, టీవీలలో చూస్తూ ఉంటాము. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం నడికూడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నో బ్యాగ్ డే సందర్భంగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయిడు అచ్చ సుదర్శన్ రైల్వే గేట్ల వద్ద జరిగే ప్రమాదాలను నివారించేందుకు విద్యార్థులకు ప్రత్యక్షంగా నాటకీకరణం ద్వారా చూపించి ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన చేయించడం జరిగింది. పాఠశాలలోనే రైల్వే ట్రాక్ ను ఏర్పాటు చేసి, విద్యార్థులను ఒక ట్రైన్ గా, తోటి విద్యార్థులను ట్రైన్ వస్తున్నప్పుడు గేట్ దాటుతున్నట్టుగా నాటకీకరణ చేపించి ప్రమాదాలు జరుగుతున్న తిరును కండ్లకు అద్దం పట్టే విధంగా చేయించడం జరిగింది. ట్రైన్ వస్తున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించి చెప్పడం జరిగింది. ఇలా ప్రత్యక్ష బోధన కలిగించడం ద్వారా విద్యార్థుల్లో జీవితాంతం మర్చిపోకుండా ఉండే విధంగా ఉపయోగపడడమే కాకుండా రైల్వే గేట్ల వద్ద జరిగే ప్రమాదాలను వారి తల్లిదండ్రులకు కూడ అవగాహన కల్పిస్తారని, అనే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నో బ్యాగ్ డే సందర్భంగా విద్యార్థులను ఫీల్డ్ ట్రిప్స్ తీసుకువెళ్లడం, అదేవిధంగా ప్రత్యక్ష అనుభవాన్ని విద్యార్థుల్లో కలిగించడం ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్,ఉపాధ్యాయులు పోలంపల్లి విజేందర్, నిగ్గుల శ్రీదేవి చేస్తున్నారు.