సహజ సేంద్రియ వ్యవసాయంపై అవగాహన
రైతు వారం (రైతు వారోత్సవాలు) పై రైతు వేదిక స్థాయిలో సమావేశాలు
మొగుళ్లపల్లి నేటి దాత్రి
భూపాలపల్లి జిల్లామొగుళ్ళపల్లి మండలలంలోని ఐదు రైతు వేదికల (మొగుళ్ళపల్లి, ముల్కలపల్లి, రంగాపూర్, వేములపల్లి మరియు పర్లపల్లి) నందు “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” – 99 డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా రైతు వారం (రైతు వారోత్సవాలు) (4th May నుండి 9th May 2026 వరకు) అనే కార్యక్రమములో మొదటి రోజున వ్యవసాయశాఖకు సంబంధించి మొగుళ్ళపల్లి రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి, సురేందర్ రెడ్డి, తహశీల్దార్ సునీత, ఎంపీడీవో సురేందర్ గౌడ్, స్థానిక సర్పంచ్ చాట్ల, విజయ, రవీందర్ స్థానిక ఎర్రబెల్లి ఉప-సర్పంచ్ హిమబిందు కోటేశ్వరరావుమరియు సంబంధిత ఏ ఈ ఓ గార్ల ఆధ్వర్యంలో రైతులతో సమావేశాలు నిర్వహించడం జరిగింది. :-
* నేల ఆరోగ్య పరిరక్షణ, సాయిల్ హెల్త్ వాలంటీర్లు.
* సమతుల ఎరువుల వినియోగం, సమగ్ర పోషక నిర్వహణ.
* నానో మరియు ద్రవ ఎరువుల ప్రోత్సాహం.
* నిగ్రణి సమితిలు – నిర్వహణ పై అవగాహన కల్పించడం.
* సహజ సేంద్రియ వ్యవసాయం పై అవగాహన కల్పించడం.
* నాణ్యమైన విత్తనాల వినియోగం, వినియోగదారులు ఇష్టపడే వరి రకాల ప్రోత్సాహం
* పంట రుణాలు
* వ్యవసాయ యాంత్రీకరణ వంటి అంశాలపై రైతులకు శాస్త్రీయ పద్ధతుల్లో అవగాహన కల్పించడం జరిగింది.
అనంతరం రైతులకు భూసర పరీక్షలలో భాగంగా మట్టి నమూనాల సేకరణ విధానాలపై, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరిగింది, అలాగే భూసర పరీక్షల సర్టిఫికెట్లను ఆయా రైతులకు అందిచడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు మాళవిక, భవాని, శ్రీకాంత్, నూతన్ ప్రసాద్ మరియు అభినయ్ పాల్గొని సమవేశాలు నిర్వహించడం జరిగింది. అలాగే అన్ని గ్రామాల సర్పంచులు, ఉప-సర్పంచులు, మరియు ఇతర ప్రజాప్రతినిధులు, అభ్యుదయ రైతులు పాల్గొనడం జరిగింది.
