• నాణ్యత ప్రమాణాలు పాటించాలి
• మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి
నిజాంపేట,నేటి ధాత్రి
యాసంగి వరి కోతులపై రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం వ్యవసాయ అధికారులు రైతువేదికలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో వివిధ గ్రామాల రైతులతో సమావేశం ఏర్పాటు చేసి మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి మాట్లాడారు… రైతులు యాసంగి కోతల సమయంలో పలు జాగ్రత్తలు పాటించాలన్నారు. వరి కోసే సమయంలో హార్వెస్టర్ లో ఉండే ఫ్యాన్ బెల్ట్ యొక్క వేగం 18 – 20 ఆర్ పి యం ఉంచడం ద్వారా తాలు గింజలు ధాన్యంలో రాకుండా నివారించవచ్చున్నారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చే సమయంలో తేమ శాతం 17 కంటే తక్కువ ఉండాలని అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు రమ్య, శ్రీలత, మౌనిక, వివిధ గ్రామాల రైతుల ఉన్నారు.