రామయంపేట (మెదక్) నేటి ధాత్రి.
వ్యాప్తంగా సుమారుగా 13వేల ఎకరాల్లో వరి పంట సాగయ్యే అవకాశం ఉందని రైతులు ప్రతి సీజన్లో వరి పంట తర్వాత వరి వేయడం , పంట మార్పిడి చేయకపోవడం వల్ల చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉందని, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వరిలో వచ్చేటు వంటి కాండం తొలుచు పురుగును సమర్ధవంతంగా అరికట్టవచ్చని లేనట్లయితే రైతుకు ఆర్థికంగా నష్టపరిచే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు వరి పంటలో కాండం తోలుచు పురుగు పట్ల అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ అధికారి రాజ నారాయణ సూచించారు ఈ సందర్భంగా రామయంపేట మండలం జాన్సీ లింగాపూర్ గ్రామంలో వివిధ రైతులకు చెందిన వరి క్షేత్రాలను సందర్శించి కాండం తోలుచు పురుగు నివారణ కోసం పలు చర్యలు చేపట్టవలసినదిగా రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ వరిలో నారుమడి దశ నుండే కాండం తొలిచే పురుగు ఉధృతి తగ్గించే విధంగా ఎకరం సరిపోయే నారు మడి కి ఒక్క కేజీ కార్బో ఫ్యూరాన్ గుళికల ను వేయాలి , కాండం తోలుచు పురుగు యొక్క తల్లి పురుగు 300 నుండి 400 గుడ్లను వరి మొక్కల యొక్క ఆకుల కొన భాగంలో వెనుక వైపున గుడ్లను పెడుతుంది, వీటిని రైతులు సరిగ గమనించక పోవడం వలన ప్రధాన పొలంలో నాటు వేసిన పది రోజుల్లో గుడ్ల నుండి కాండం తొలుచు పురుగు లార్వాలు బయటకు వచ్చి పంటకు ఆర్థికంగా నష్టం చేస్తాయి వీటి నివారణ కోసం నాటు వేసే ముందు నారు పీకిన తర్వాత ఆకుల చివరి భాగాన్ని కత్తిరించి ,కత్తిరించిన ఆకులను మరియు గుడ్ల సముదాయాలను నాశనం చేసినట్లయితే కాండం తొలిచే పురుగు లేదా మోగి పురుగుల ఉధృతిని కొంతవరకు తగ్గించే అవకాశం ఉంది నాటు వేసిన పది రోజుల్లోపు కాండం తోలుచు పురుగు గమనించినట్లయితే నివారణకు కార్టాఫ్ హైడ్రో క్లోరైడ్ గుళికలను ఐదు కేజీల నుండి ఎనిమిది కేజీల వరకు ఎకరాకు చల్లుకోవాలి, క్లోరాంత నిలిప్రోల్ 0.4 గుళికలను ఎకరాకు నాలుగు కేజీల చొప్పున చల్లుకోవాలి ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు