
గొల్లపల్లి నేటి దాత్రి:
రైతులకు సమగ్ర వ్యవసాయ పద్ధతుల గురించి రైతు శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు గొల్లపల్లి రైతు వేదికలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయగా రైతులకు రైతు శిక్షణ కేంద్రం డా. గోవర్ధన్ ప్రధాన శాస్త్రవేత్త (అగ్రనామి) హెడ్ అఖిలభారత సమగ్ర వ్యవసాయ పద్ధతుల పరిశోధన విభాగం రాజేంద్రనగర్ రైతులకు సమగ్ర వ్యవసాయ పద్ధతుల గురించి వివరించడం జరిగింది. డ్రోన్లతో రసాయనిక ఎరువులు, పురుగు మందులు వినియోగించే పద్ధతుల గురించి డా. ఎన్. రామ గోపాల వర్మ ప్రధాన శాస్త్రవేత్త (కీటక శాస్త్రం) వరి పరిశోధన సంస్థ, రాజేంద్రనగర్ రైతులకు క్లుప్తంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు బి. గంగాధర్ నాయక్, పి. అశ్విని, ఆర్ .శ్రీహరి, పి. అలేఖ్య, జే .వంశీ, మాజీ సర్పంచ్ ముస్కు నిశాంత్ రెడ్డి , రైతులు బుచ్చిరెడ్డి, గంగాధర్ గౌడ్, రజిత, స్వామి రెడ్డి, ప్రవీణ్, రమణ తదితరులు పాల్గొన్నారు.