విద్యార్థులకు బాలల భద్రతపై అవగాహన
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండల పరిధిలోని హోతి కే లో గల టిజిఆర్ఎస్, జూనియర్ కళాశాల విద్యార్థులకు బాలల భద్రత రక్షణపై అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్య వివాహాలు, పిల్లల అక్రమ రవాణా, 1098 హెల్ప్ లైన్ వినియోగం, విద్యార్థుల హక్కులు, బాలికల విద్యా ప్రాముఖ్యత మంచి-చెడు స్పర్శ, లింగ వివక్ష, మొబైల్ ఫోన్ సమస్యలు, పోక్సో చట్టం వంటి అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు. విద్యార్థులకు విద్య ప్రాముఖ్యత, బాలికల భద్రత కోసం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రిన్సిపల్ వివరించారు.
