చిట్యాల, నేటిధాత్రి :
జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని వరికోల్పల్లి కుమ్మరిపల్లి అంగన్వాడీ కేంద్రాలలో ఆరోగ్య లక్ష్మి కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి ఐసిడిఎస్ కార్యక్రమాల గూర్చి తల్లులు మరియు తండ్రులకు జయప్రద ఐ సి డి ఎస్ సూపర్వైజర్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా ప్రతిరోజు గర్భవతులు బాలింతలు కేంద్రం నకు వచ్చి భోజనం చేయాలని ఉదయం 9 గంటలకు పిల్లలందరినీ కేంద్రానికి పంపించాలని ప్రతి నెల 1వ తేదీ రోజు పిల్లలందరి బరువులు తీర్చుకోవాలని లోప పోషణ లేకుండా సరియైన వయస్సులో సరియైన మోతాదులో సమతల హారము పెట్టాలని వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని అన్నారు అలాగే నలుగురు పిల్లలకు అక్షరాభ్యాసము చేయించి వ్యక్తిగత శుభ్రతలో భాగంగా తల్లులు పిల్లలతో ఆరు పద్ధతుల ద్వారా చేతులు శుభ్రంగా కడిగించడం జరిగింది, ప్రతిరోజు ఇంటి వద్ద కూడా ఈ పద్ధతి పాటించాలని అన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ హైమావతి మెహర్ హునిసా ఆయాలు శ్రావణి విజయ పిల్లల తల్లులు మహిళలు పాల్గొన్నారు.