ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – అవగాహన సదస్సు
ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక పై సంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధుల అవగాహన సదస్సు లో పాల్గొన్న కలెక్టర్ ప్రావీణ్య ,మంత్రి దామోదర్ రాజనర్సింహ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా:సంజీవ రెడ్డి రాష్ట్ర చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి…
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై సంగారెడ్డి జిల్లాలోని మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, గ్రామ పంచాయతీల సర్పంచులు మరియు మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లకు ఒక రోజు అవగాహన సదస్సు గురువారం జరిగింది. కంది మండల కేంద్రం లోని ఎల్ఎన్ కన్వెన్షన్ లో జరిగిన ఈ అవగాహన సదస్సు కు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, నారాయణఖేడ్ MLA సంజీవ రెడ్డి టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరయ్యారు.రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా 06.03.2026 నుండి 12.06.2026 వరకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు ఈ కార్యక్రమం లక్ష్యాలు, అమలు విధానం మరియు ప్రభుత్వ ఫ్లాగ్షిప్ పథకాలపై. ప్రజా ప్రతినిదులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం అన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలని, కాంగ్రెస్ ప్రజా పాలన గడప గడపకు చేరాల ని అందుకు ప్రజా ప్రతినిధులందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతీ ప్రభుత్వ పథకం మహిళల పేరు మీదే మంజూరు అవుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారత కు పెద్ద పీట వేస్తున్నదని వివరించారు. ఈ కార్యక్రమంలో ఝారసంగం మండల సర్పంచులు మరియు నాయకులు పాల్గొన్నారు
