
మరిపెడ నేటి ధాత్రి
మహిళా హక్కులు చట్టాలపై ప్రతి మహిళకు అవగాహన కలిగి ఉండాలని అంగన్వాడి అబ్బాయి పాలెం సెక్టర్ సూపర్వైజర్ విజయ అన్నారు. సోమవారం మండలంలోని అబ్బాయి పాలెం గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా సదస్సు నిర్వహించారు. మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ కల్పించారనీ తెలిపారు. మహిళలపై వేధింపులు దాడులు దౌర్జన్యాలు జరిగినప్పుడు, షిటీం పోలీస్ శాఖకు ఫిర్యాదు చేయడంతోరక్షించ
బడతారన్నారు.సమాజంలో
పురుషులతో సమానంగా మహిళలకు అన్ని హక్కులు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోలేక
పోతున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కామెంట్ల విజయకాంత, అలవాల సరస్వతి, ధారావత్ లలిత, డ్వాక్రా సంఘాల మహిళలు తదితరులు ఉన్నారు.