వీణవంక,( కరీంనగర్):
నేటి ధాత్రి:వీణవంక ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఆత్మహత్యల నివారణ పై విద్యార్థులకు శుక్రవారం కళాశాల ప్రిన్సిపల్ కే రాజి రెడ్డి అధ్యక్షతన
అవగాహన కల్పించారు.
వీణవంక డాక్టర్ వరుణ మెడికల్ ఆఫీసర్,మానసిక నిపుణులు రమణాకర్ రెడ్డి జిల్లా మానసిక ఆరోగ్య విభాగం అవగాహన కల్పించడం జరిగింది. డాక్టర్ వరుణ మాట్లాడుతూ… మానసికంగా దృఢంగా ఉండాలని సమస్యలను అధిగమించుటకు తల్లిదండ్రులను గాని అధ్యాపకులకు గాని డాక్టర్ గాని తెలియపరచాలని ఆత్మహత్య అనేది శనికి ఆవేశంతో తీసుకునే నిర్ణయం అని కుటుంబానికి హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవద్దని జీవితం అనేది దేవుడిచ్చిన వరమని విద్యార్థుల తల్లిదండ్రుల ఆశయాలకు ఆశలు నెరవేర్చే విధంగా చదువుపై శ్రద్ధ చూపి ముందుకు సాగాలని కోరారు. మానసిక నిపుణుడు రమణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆత్మహత్య అనేది మానసిక ఒత్తిడి నుండి ఉద్భవించునని మానసిక ఒత్తిడి నివారణకు కొన్ని శారీరక వ్యాయామాలు చేస్తే ఒత్తిడి దూరం చేసుకోవచ్చని మరియు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని తెలియజేశారు. కార్యక్రమంలో లైబ్రరీ రామ్మోహన్ అధ్యాపకులు విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు.