ఓటు హక్కు పై అవగాహనా సదస్సు..

# ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో నిర్వహణ

నర్సంపేట,నేటిధాత్రి :

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) లో కళాశాల జాతీయ సేవ పథకం యూనిట్ల మరియు పొలిటికల్ సైన్స్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్ అధ్యక్షతన ఓటు హక్కు పై అవగాహనా సదస్సు నిర్వహహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిధిగా డాక్టర్ డి గోపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, పుత్తూరు, ఆంధ్రప్రదేశ్ హాజరు అయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ మల్లం నవీన్ మాట్లాడుతూ భారత దేశం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని తెలుపుతూ ఇప్పుడు మన దేశంలో కేంద్ర ఎన్నికలు మరియు వివిధ రాష్ట్రాలలో శాశన సభ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంలో ఓటు హక్కుపై అవగాహనా సదస్సు నిర్వహించడం చాలా సంతోషం అని తెలిపారు. ముఖ్య అతిథి డాక్టర్ డి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వాయంలో ఓటు హక్కు అనేది శక్తిశాలి అని తెలిపారు. ప్రతి వ్యక్తి తన ఓటు హక్కును తప్పనిసరిగా సక్రమంగా వినియోగించాలని సూచించారు.ఎవ్వరు కూడా ప్రలోభాలకు, ఇతర ఆశలకు లోను కాకుండా తమ ఓటు హక్కును స్వేచ్చాయుతంగా వినియోగించాలని సూచించారు. సిబ్బంది మరియు విద్యార్థులు ఓటు హక్కు పై తమ ప్రాంతాలలో అవగాహనా కల్పించి ఓటింగ్ శాతం అత్యధికం నమోదు అయ్యే విధంగా కృషి చెయ్యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఐక్యూఏసి సమన్వయకర్త డాక్టర్ ఏ శ్రీనాథ్, ఎన్ఎస్ఎస్ జిల్లా అధికారి డాక్టర్ ఐ శివనాగశ్రీను, కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ బి రమేష్, పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ యం.శైలజ, టి.రమేష్, యల్.సత్యనారాయణ, డాక్టర్ బి.విష్ణు కుమార్, డాక్టర్ జి.ప్రసూన, యం.సమ్మయ్య, డాక్టర్ టి.సుమతి, యం.నరేందర్, పి.త్యాగయ్య, డాక్టర్.వి.పూర్ణ చందర్, డాక్టర్.ఆర్.కుమారస్వామి, పి.సునీల్, నిజాముద్దీన్, నాన్-టీచింగ్ సిబ్బంది, విద్యార్ధిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!