చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని నవాబుపేట గ్రామంలో ప్రపంచ కుష్టు వ్యాధి నివారణపై శనివారం రోజున ఒడితల మెడికల్ ఆఫీసర్ నవత ఆదేశాల మేరకు ఏఎన్ఎం సుమలత ,ఆధ్వర్యంలో గ్రామపంచాయతీలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బాలకృష్ణ, హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలకు చర్మవ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ముఖ్యంగా శరీరంపై ఏర్పడే మచ్చలను గమనించి వాటికి స్పర్శ ఉందా లేదా అని గమనించాలన్నారు.స్పర్శ లేకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. కాబట్టి విద్యార్థులందరూ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం కూడా ఆరోగ్యకరంగా మారుతుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా కుష్టు వ్యాధి లక్షణాలు వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు జయలత, పంచాయతీ కార్యదర్శి సుచరత, ఆశా వర్కర్లు కమల సరోజన, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు నేరెళ్ల ఓదెలు, తీగల బాలకృష్ణ, పర్లపల్లి సమ్మయ్య,అనిల్, తదితరులు పాల్గొన్నారు.