
విద్యార్థుల కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్సై
మరిపెడ ఎస్సై బొలగాని సతీష్ గౌడ్.
మరిపెడ నేటిధాత్రి
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ని గ్లోబల్ స్కూల్లో గ్లోబల్ స్కూల్ కరస్పాండెంట్ కాలు నాయక్, డైరెక్టర్ అఫ్జల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విద్య క్రమశిక్షణతో కూడిన అవగాహన సదస్సు ను నిర్వహించిన సందర్భంగా ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా మరిపెడ ఎస్సై బొలగాని సతీష్ గౌడ్ హాజరయ్యారు, అనంతరం విద్యార్థుల ను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకొని మంచి క్రమశిక్షణతో ముందుకెళ్లాలని మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని భవిష్యత్తులో మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని చెడు మార్గాలకు అలవాటు పడకూడదని, పదవ తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించి ఇంటర్ డిగ్రీ పై స్థాయిలకు వెళ్లి మంచిగా చదువుకొని భవిష్యత్తులో స్థిరపడి మీ తల్లిదండ్రులకు మీ గ్రామానికి మీరు సేవ చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు, విద్యార్థులు చదువు మానేసి
రోడ్లపై తిరగడం బైకులపై రాష్ డ్రైవింగ్ చేయడం వంటివి చేయకూడదని మంచి సత్ప్రవర్తనతో జీవితంలో ముందుకెళ్లాలని విద్యార్థులను ఉద్దేశించి చెప్పడం జరిగింది విద్యార్థుల కు ముందు గా
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు,ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తామస్ బెన్నీ , ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.